![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -930 లో... వసుధార వల్లనే చిత్ర సూసైడ్ చేసుకుందని పోలీసులు వసుధారని అరెస్ట్ చెయ్యడానికి వస్తారు. నేనేం తప్పు చెయ్యలేదని వసుధార చెప్పినా వినిపించుకోరు. చిత్ర వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ మేడమ్ వల్లనే అని చెప్పడంతో పోలీసులు వసుధారని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుంటే రిషి, మహేంద్ర ఆపే ప్రయత్నం చేస్తారు.
ఆ తర్వాత అప్పుడే అక్కడికి అనుపమ వస్తుంది. అక్కడ అందరి ముందు వసుధారనే తప్పు చేసింది అన్నట్లుగా మాట్లాడుతుంది. తన గురించి ఏం తెలియకుండా ఎలా ఎండీ బాధ్యతలు ఇచ్చారంటు మహేంద్ర, రిషిలని అనుపమ అడుగుతుంది. నేనేం తప్పు చేయలేదు మేడమ్ అని వసుధార చెప్పిన కూడా అనుపమ వినిపించుకోదు. ఆ తర్వాత వసుధారని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. వసుధార ఇలా చేస్తుందని అనుకోలేదు. ఎండీ స్థాయికి వెళ్ళింది అంటే గొప్ప గొప్ప ఆలోచనలు ఉంటాయి అనుకున్నా కానీ ఇలా చేస్తుందని అనుకోలేదని వసుధార గురించి తప్పుగా మాట్లేడేసరికి రిషి, మహేంద్రలకి కోపం వస్తుంది. మీరు తన గురించి తెలియకుండా మాట్లాడకండి. మిషన్ ఎడ్యుకేషన్ పేరిట ఎంత మంది స్టూడెంట్స్ కి హెల్ప్ చేసిందో మీకేం తెలుసు. వసుధార గురించి తప్పుగా మాట్లాడకండి అని రిషి గట్టిగనే చెప్తాడు. వసుధార తప్పు చేసిందంటే జగతి చేసినట్టే ఎందుకంటే తను జగతిని పోలి ఉంటుంది. నువ్వు వసుధారని అవమానిస్తే జగతిని అవమానించినట్లే, తను జగతి స్టూడెంట్ అని అనుపమపై మహేంద్ర కోప్పడతాడు. ఆ తర్వాత మహేంద్ర, రిషి తెలిసిన వాళ్లకి ఫోన్ చేసి.. వసుధారకి బెయిల్ ఇప్పించండని అడుగుతారు.
ఆ తర్వాత రిషి, మహేంద్ర ఇద్దరు స్టేషన్ కి వెళ్లి వసుధారని కలుస్తారు. చెయ్యని తప్పుకి నింద మోస్తున్నానని వసుధార ఎమోషనల్ అవుతుంది. నువ్వు టెన్షన్ పడకు వసుధార బెయిల్ ఇప్పిస్తానని వసుధారకి రిషి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత తెలిసిన వాళ్లకి ఫోన్ చేసి అడిగినా ఉపయోగం లేకుండా పోతుంది. కాసేపటికి ఒక లాయర్ వచ్చి వసుధారకి బెయిల్ ఇస్తాడు. ఎవరు పంపించారని అనగానే.. అనుపమ మేడమ్ పంపిందని చెప్పి వసుధారని బయటకు తీసుకొని వస్తాడు. ఆ తర్వాత బయట అనుపమ ఉంటుంది. థాంక్స్ అని మహేంద్ర చెప్పగానే.. నేను తన కోసం ఏం చెయ్యలేదు. తన తప్పు చేస్తే జగతి తప్పు చేసినట్టు అన్నారు కాబట్టి చేశాను. జగతి తప్పు చెయ్యదు. కానీ వసుధార తప్పు చేసిందని అంటుంది. నువ్వు తప్పు చెయ్యలేదని నిరూపించుకోమని అనుపమ అంటుంది. మీరు వసుధారా తప్పు చేసింది అన్న ఆలోచన మానుకోండి అని అనుపమకి రిషి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |